ప్రధాన రహదారి అధ్వాన్నం. ప్రమాదాలకు నిలయంగా మారిన విద్యానగర్ సెంటర్..!

🔷మౌనం వీడని ఆర్.అండ్.బి అధికారులు...మూల్యం చెల్లిస్తున్న ప్రజలు..! 🔷విద్యానగర్ ప్రధాన రహదారి దుస్థితి...స్పందించని అధికారులు కోట స్వర్ణసాగరం జులై 20 కోట మండలంలోని విద్యానగర్ సెంటర్ ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని భారీ గుంతలతో చెరువును తలపిస్తోంది.ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇది ప్రధాన రహదారి కావడంతో ప్రతిరోజూ వందలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది.గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు కనిపించక...