ప్రిన్సిపాల్ సరిత రోజిలిన్ ఆధ్వర్యంలో బీసీ గురుకులంలో ఘనంగా మెగా పీటీఎం 4.0
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరం-జలీల్ అహ్మద్ కోట స్వర్ణసాగరం జూలై 24: కోట మండలం కోటలోని బీసీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ సరిత రోజిలిన్ ఆధ్వర్యంలో మెగా పీటీఎం 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తహసీల్దార్ జయ జయ రావు,టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్,మద్దాలి సర్వోత్తమ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అతిథులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ,విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు కలిసి పనిచేయడం ఎంతో కీలకమని అన్నారు.పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రగతి,...