swarnasagaram.com
Date of Publish : 22 July 2026, 5:16 pm Posted by : Pakam chennakesavulu Kota Mandal

రైతు సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయం-టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం జులై 22

కోట స్వర్ణసాగరం, జూలై 22:
కోట మండలం కొత్తపాలెం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పి.ఎ.సి.ఎస్ వద్ద బుధవారం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెన్నకి చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు నెల్లూరు మోహన్ రెడ్డి చేతులు మీదుగా రైతులకు జీలగల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నెల్లూరు మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు జీలగలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.రైతులకు నాణ్యమైన వ్యవసాయ అవసరాలను సకాలంలో అందించి సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.రైతుల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాదని పేర్కొన్నారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ విత్తనాలు, ఎరువులు,ఇతర వ్యవసాయ అవసరాలను అందుబాటులో ఉంచుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గుండాల సుబ్రహ్మణ్యం,కాసుల శ్రీనివాసులు,ఎంపీటీసీ నారాయణ,గ్రామ పార్టీ అధ్యక్షులు ముంగర మురళి రెడ్డి, పెన్నకి చెరువు మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు నేదురుమల్లి హరి ప్రసాద్ రెడ్డి,రైతులు, స్థానికులు పాల్గొన్నారు.