♦️శ్యామసుందరపురం కాలనీలో రెండో రోజు ఇంటింటి టీడీపీ ప్రచారం
కోట స్వర్ణసాగరం జూలై 28
కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో మంగళవారం రెండో రోజు తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది. ప్రజల నుంచి విశేష స్పందన మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటిని సందర్శించిన నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు,అలాగే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు గురించి వివరంగా తెలియజేశారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ,రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని,అలాగే గూడూరు శాసనసభ్యులు కోట పంచాయతీ అభివృద్ధికి సమస్యలు తెలిపిన వెంటనే స్పందిస్తూ నిధులను మంజూరు చేయించి అభివృద్ధికి పెద్దపీట వేశారని అన్నారు.మహిళలు, రైతులు,యువత,విద్యార్థులు, వృద్ధులు,పేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు,యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే మెగా డీఎస్సీ,విద్య,ఆరోగ్యం,మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించి, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.ప్రచారంలో భాగంగా కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించిన షేక్ జలీల్ అహ్మద్ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.తాగునీటి సరఫరా, పారిశుధ్యం,అంతర్గత రహదారులు,డ్రైనేజీ తదితర సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకురాగా,వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు.ప్రజల సమస్యలపై తక్షణ స్పందన చూపిన ఆయన తీరు స్థానికులను ఆకట్టుకుంది.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంచడమే ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.ప్రజల సహకారంతో గ్రామాభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుందని,ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కాలనీవాసులు మాట్లాడుతూ,తమ సమస్యలను ఓపికగా విని వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు చేపట్టిన షేక్ జలీల్ అహ్మద్‌ను అభినందించారు.అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు,సూపర్ సిక్స్ హామీలపై స్పష్టమైన అవగాహన కల్పించినందుకు సంతోషం వ్యక్తం చేశారు.రెండో రోజు కూడా ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది.ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు,ఎంపీటీసీలు షేక్ శంసుద్దీన్, దారా సురేష్,టీడీపీ నాయకులు షేక్ నౌషాద్,తల్లం శ్రీనివాసులు,నందం మోహన్,సుహాసిని,పోలమ్మ,పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు,యువత, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.