చిట్టేడు డ్రైనేజీ దుస్థితి- పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
💥మెయిన్ రోడ్డుపై దుర్వాసన వెదజల్లుతున్న చెత్తతో నిండిన కాలువ 🔶సచివాలయం,పంచాయతీ సిబ్బంది పట్టించుకోవట్లేదంటూ ప్రజల ఆగ్రహం కోట స్వర్ణసాగరం ఆగష్టు 3 కోట మండలం చిట్టేడు గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న డ్రైనేజీ కాలువ పూర్తిగా చెత్తాచెదారంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామం నడిబొడ్డున ఉన్న ఈ కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు,మురుగు పేరుకుపోవడంతో మురుగునీరు సరిగా ప్రవహించక నిల్వ ఉండిపోయింది.దీంతో దుర్వాసన భరించలేని స్థాయికి చేరిందని,ప్రధాన రహదారిపై...