తల్లిపాలే శిశువుకు తొలి అమృతం-సూపర్వైజర్ కృష్ణమ్మ

కోట స్వర్ణసాగరం ఆగస్టు 3 కోట మండలం తిన్నెలపూడి పంచాయతీ పరిధిలోని తల్లిపాలవారిస్థావలలో తల్లిపాల వారోత్సవాలను అంగన్‌వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలతో నిర్వహించారు.ఈ సందర్భంగా శిశువులకు తల్లిపాల ప్రాముఖ్యత,తల్లిపాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై తల్లులకు వివరించారు.కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ కృష్ణమ్మ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని,శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత కీలకమని తెలిపారు.ముఖ్యంగా పుట్టిన తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని అవగాహన కల్పించారు.తల్లిపాలలో...