swarnasagaram.com
Date of Publish : 04 August 2026, 6:33 pm Posted by : DAMA VIJAYAKUMAR

ప్రజల గడపలోకి కూటమి.. సంక్షేమమే మా బలం

జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, కార్యక్రమం యూనిట్ ఇన్‌చార్జి జలీల్ అహ్మద్

స్వర్ణసాగరం, కోట, ఆగస్టు 4:

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా కోట పట్టణంలోని శ్యామసుందరిపురం ప్రాంతంలో మంగళవారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనార్టీ అధ్యక్షుడు, కార్యక్రమం యూనిట్ ఇన్‌చార్జి జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అదే సమయంలో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అవసరాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ప్రజలు కూటమి నాయకులకు ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాలు–పట్టణాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.జలీల్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసమే కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద బలమని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వానికి మరింత చేరువయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ప్రజల సూచనల మేరకు అవసరమైన అభివృద్ధి పనులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు శంషుద్దీన్, సోషల్ మీడియా అధ్యక్షుడు మధుబాబు, మహిళా నాయకురాలు సుహాసిని, ఉపాధ్యక్షుడు నీలేష్, నాయకులు తల్లం శ్రీనివాసులు, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంతో స్థానికులు కూటమి నాయకత్వానికి అభినందనలు తెలిపారు.