రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన
కోట, స్వర్ణసాగరం :
రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ పనితీరును ఇంటింటికీ చేరవేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం కోట పట్టణ పరిధిలోని శ్యామసుందరిపురంలో గురువారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించారు.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి ఎలా చేరాయో వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమానికి స్థానిక ప్రజలు విశేష స్పందన వ్యక్తం చేస్తూ కూటమి నాయకులకు ఆత్మీయ స్వాగతం పలికినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీ షంషుద్దీన్, పార్లమెంట్ కార్యదర్శి సిద్ధపరెడ్డి పోలమ్మ, నియోజకవర్గ మైనార్టీ నాయకులు నౌషాద్ భాషా, నందన్ మోహన్, శ్రీనివాసులు, సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు నీలేష్ తదితరులు పాల్గొన్నారు.