వాడవాడలా కూటమి ప్రచారం.. సంక్షేమ పథకాలపై అవగాహన

రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన కోట, స్వర్ణసాగరం :  రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ పనితీరును ఇంటింటికీ చేరవేయాలనే లక్ష్యంతో చేపట్టిన 'రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం కోట పట్టణ పరిధిలోని శ్యామసుందరిపురంలో గురువారానికి 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల...