swarnasagaram.com
Date of Publish : 15 September 2026, 2:44 pm Posted by : DAMA VIJAYAKUMAR

ఇకపై తండ్రి పేరుతో సేవా ప్రస్థానం

మహాదేవ ట్రస్ట్‌కు శ్రీకారం చుట్టిన కలవగుంట భరత్‌రెడ్డి

స్వర్ణసాగరం, శ్రీకాళహస్తి, సెప్టెంబర్‌ 15:

గత 17 ఏళ్లుగా ప్రజాసేవను కొనసాగిస్తున్న కలవగుంట భరత్‌రెడ్డి.. తన సేవా కార్యక్రమాలను ఇకపై తండ్రి మహాదేవరెడ్డి పేరుతో మరింత విస్తృతం చేసేందుకు **‘మహాదేవ ట్రస్ట్‌’**ను ప్రారంభించారు. నేడు తండ్రి మహాదేవరెడ్డి, తన పుట్టినరోజు ఒకే రోజు కావడం విశేషం. పుట్టినరోజు సందర్భంగా అమ్మ ఆశ్రమం నిర్వాహకుల చేతుల మీదుగా ట్రస్ట్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇకపై శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదలు, అనాథలు, విద్యార్థులు, వృద్ధులకు అండగా నిలిచేలా ట్రస్ట్‌ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడతామని భరత్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అమ్మ ఆశ్రమంలో అనాథ వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం అభిమానులు కేక్‌ కట్‌ చేసి భరత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజును సేవా కార్యక్రమంతో ప్రారంభించడం పట్ల పలువురు అభినందించారు.