swarnasagaram.com
Date of Publish : 01 September 2026, 8:42 pm Posted by : DAMA VIJAYAKUMAR

సి యం సహాయానిది పేదల బతుకుల పెన్నిధి – దువ్వూరు మధుసూదన్ రెడ్డి

బాధితులకు 2,22,571 లక్షల రూపాయల సి యం సహాయానిది

తుమ్మల మోహన్ నాయుడు నివాసం వద్ద చెక్కులు పంపిణి

స్వర్ణసాగరం వాకాడు ( కొండాపురం )

ముఖ్యమంత్రి సహాయానిది పేదల బతుకుల పెన్నిదని తెలుగుదేశం పార్టీ మండలం అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం గ్రామంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు నివాసం వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహానిది చెక్కుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మండలం పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధు సూదన్ రెడ్డి, సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి రాష్ట్రంలో పేద ప్రజలకు అనారోగ్య బారిన పడిన పేదవారికి వైద్య ఖర్చులకు ఎంతగానో సహాయపడుతుందని ఇదే క్రమంలో గూడూరు శాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ చరవతో ఈ కొండాపురం పంచాయతీలోని నలుగురు లబ్ధిదారులకు వలిపి ఈశ్వరమ్మ 23,400 రూపాయలు,తుమ్మల గోపాల నాయుడు 62,038 రూపాయలు, మీరగ దయాకర్ 84,928 రూపాయలు, చెముడుగుంట వెంకటయ్య 52,205 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశామని వీటి ద్వారా వారి ఆరోగ్య కుటుంబ పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నందగోపాల్ రెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, పంట్రంగం అరుణ్ కళ్యాణ్, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, కిషోర్ రెడ్డి, అన చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు జనార్ధన్, వెంకట కృష్ణయ్య, వెంకటేష్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.