ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాశం సునిల్ కుమార్ నాయుకులకు సూచ
కేశవరం పంచాయతీలో 8 కోట్ల 70 లక్షలతో అభివృద్ధి
స్వర్ణసాగరం కోట (సెప్టెంబర్ 01) ( రిపోర్టర్ దాసరి వెంకటేష్)
కోట మండలం కేశవరం పంచాయతీ రాఘవపురంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందించేటప్పుడు స్థానిక నాయకులు తమ సొంత ప్రచారం చేసుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ప్రధానిమంత్రి నరేంద్ర మోడి , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషేనని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోట మండలంలో కేశవరం పంచాయతీ పరిధిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ఎన్ టి ఆర్ పింఛన్ పధకం ద్వారా 570 లబ్ది దారులకు 22లక్షల 80 వేల రూపాయలు,అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 397 మంది రైతులకు 1 కోటి 71 లక్షల రూపాయలు, తల్లికి వందనంపధకం ద్వారా 543 మంది విద్యార్థులకు 81లక్షల 40 వేల రూపాయలు,సీసీ రోడ్లు కోసం 30 లక్షల రూపాయలు, త్రాగునీరు ఫైప్ లైన్ 5 లక్షల రూపాయలతో నూతన బోర్ వెల్ కొరకు శంకుస్థాపన, సి ఎం ఆర్ ఎఫ్ ఫండ్ కింద 6 మంది లబ్దిదారులకు 27 లక్షల రూపాయలతో అభివృద్ధి సుమారు మొత్తం రూ.8 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు చేశామని వెల్లడించారు. గ్రామాల్లో కక్ష్య పూరిత రాజకీయాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే వారు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ శ్రేణులు గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలకాలని, క్షేత్రస్థాయిలో జనసేన, బీజేపీ నాయకులను కలుపుకుని వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీడీపీ మొదటి నుంచి బీసీల పక్షపాతి అని, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వారి రాజకీయ ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిట్టాడు సొసైటీ అధ్యక్షులు చాపల శ్రీనివాసులు మండల,పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ మర్రి ప్రమీల, జనసేన పార్టీ అధ్యక్షులు మధు, బిజెపి పార్టీ అధ్యక్షులు హరిబాబు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్,తిరుమల శెట్టి కోటేశ్వరరావు,నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి,నెల్లూరు మోహన్ రెడ్డి ఎంపీడీఓ, సచివాలయ సిబ్బంది,స్థానిక కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు.