కోటలో అన్నదాన కార్యక్రమం
స్వర్ణసాగరం, కోట : :

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని కోట బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు పురం హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రయాణికులు, నిరుపేదలు, స్థానిక ప్రజలకు భోజనాన్ని వడ్డించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తూ సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం జనసేన పార్టీ సంప్రదాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీవీ సాయి, పి. పవన్, అల్లం బాబు, కృష్ణ, కేదార్నాథ్, శ్రీకాంత్, దుంపల సునీల్తో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.