swarnasagaram.com
Date of Publish : 29 September 2026, 5:09 pm Posted by : DASARI VENKATESH RC INCHARGE - GUDUR

బాలిరెడ్డి పాలెంలో వైసీపీ హవా* 

 

*పాఠశాల కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్విప్ చేసిన వైసీపీ*

 

*చెర్మన్ గా ఎంబెటి బాలకృష్ణ, వైస్ ఛైర్పర్సన్ రాయపు భాగ్యలక్ష్మి*

 

*కొడవలూరు భక్తవచ్చల రెడ్డి మద్దత్తు దారుడికే దక్కిన గౌరవం*

 

*స్వర్ణసాగరం వాకాడు*

 

నేడు జరిగిన పాఠశాల కమిటీ ఎన్నికల వాకాడు మండల పరిధిలోని బాలి రెడ్డిపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు కొడవలూరు భక్తవత్సల రెడ్డి మద్దతు దారులకే చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ మెంబర్లు పదవులు రావడం,ప్రతిపక్షంలో ఉండి కూడా తన సత్తాచాటి చూపించారకంటూ మండలం లోని పలువురు ప్రశంసలు గుప్పించారు. బాలిరెడ్డి పాళెం గ్రామంలో, పాఠశాల అభివృద్ధి లో అయన చేసిన పనులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతభావంతొ అయన వైపు నిలబడి క్లీన్ స్విప్ చేసి ఆయనకు బకహుమతిగా ఇచ్చాముంటూ ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఆనదాన్ని వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ ముందుగా నా పై ఇంతటి భాద్యత పెట్టిన భక్తవచ్చల రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అదేవిధంగా నన్ను నమ్మి నాపై నమ్మకం తొ విద్యార్థుల తల్లిదండ్రులు నాకు అప్పగించిన ఇంతటి భాద్యతను తుచా తప్పకుండ నిర్వర్తిస్తానని ఎల్లవేళలా అందుబాటులో ఉండి పాఠశాల అభివృద్ధి కి కృషి చేస్తానని తెలియచేస్తున్నట్లు తెలిపారు.