కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 25
కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన ఈదురు కొండయ్య బుధవారం మరణించారు. నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి కొండయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి కర్మ క్రియల ఖర్చుల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.అనంతరం ఈదూరు కొండయ్య పార్ధవదేహానికి పూలమాల వేసి ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తూ అధైర్య పడవద్దని వారికి మనోధైర్యాన్ని నింపుతూ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆపద సమయంలో అండగా నిలిచిన నెల్లూరు మోహన్ రెడ్డికి ఈదూరు కొండయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు మోహన్ రెడ్డి వెంట టిడిపి సీనియర్ నాయకులు శానంపూడి గోపాల్ రెడ్డి,నేదురుమల్లి కిరణ్ కుమార్ రెడ్డి,మురళి రెడ్డి,పెనుబోలు ప్రభాకర్ రెడ్డి, బూత్ కన్వీనర్ గుండాల సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.



