ePaper
Thursday, February 26, 2026
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రగిరి మధు

ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రగిరి మధు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 21

గూడూరు శ్యాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన కోట మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,చిట్టేడు పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రగిరి మధు శనివారం మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా చంద్రగిరి మధు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని, గ్రామాలు,పల్లెలలోని రైతులు,ప్రజలు సునీల్ కుమార్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వలన చిరునవ్వులు చిందిస్తున్నారని అన్నారు.గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు,సమస్యలు ఆయనకు తెలిపిన వెంటనే స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కృషి చేస్తున్నారన్నారు. ఈనేపథ్యంలో సునీల్ కుమార్ ని కలసి ధన్యవాదాలు తెలపడం జరిగిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular