పీఎస్ మునిరత్నం,డాక్టర్ సురేష్
రామకుప్పం స్వర్ణసాగరం ఫిబ్రవరి 14
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం మరియు ప్రజలకు మరియు ప్రభుత్వానికి వారధిగా పనిచేసేందుకు ప్రవేశపెట్టిన కుటుంబ సాధికార సమితి కే ఎస్ ఎస్ లు బాధ్యతగా పనిచేసే అభివృద్ధికి మూల స్తంభాల లాంటిదని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధ్యక్షుడు పిఎస్ మునిరత్నం పి కే యం గుడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పేర్కొన్నారు. శనివారం వారు మండల పరిధిలోని పలు గ్రామపంచాయతీలలో యూనిట్ స్థాయి కె ఎస్ ఎస్ ల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కేఎస్ఎస్ వారికి కేటాయించిన కుటుంబాల వద్దకు తీసుకెళ్లి అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అంది విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ డైరెక్టర్ మునస్వామి మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ మాజీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి ఆనంద రెడ్డి ప్రధాన కార్యదర్శి కామరాజు నాయక్, జిల్లా కార్యదర్శి పట్రా నారాయణ, ఎంపీపీ సులోచన గురప్ప, ముఖ్య నేతలు సీతాపతి, ముని రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జిలు నాగభూషణం రవి రెడ్డి కడ మెంబర్ రఘు, చంద్రారెడ్డి,పంచాయతీ పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి నియోజకవర్గ తెలుగు మహిళ యువత ప్రధాన కార్యదర్శిలు అలివేలు, అవినాష్ రెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు బాలకృష్ణ, ఆదిల్,ఐ టి డి పి భాస్కర్ గణేష్, దయా సుబ్రి సలాం సబ్ న్యూ సబ్ చాంద్ భాషా చలం పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.



