ePaper
Friday, March 6, 2026
Homeఎడిటోరియల్కోటలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

కోటలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28

కోట మండలం కోటలోని ఏవి కేఆర్ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ముందుగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ నేపథ్యంలో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల ప్రయోగాలను ఉపాధ్యాయులు సందర్శించి విద్యార్థులు రూపొందించిన విజ్ఞాన ప్రదర్శనలు వాటి పని విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ డి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ
ప్రతి ఏటా ఫిబ్రవరి 28న ఈ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విజ్ఞాన శాస్త్ర ప్రాధాన్యతను వివరించే విధంగా విద్యార్థులు వివిధ ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయం అన్నారు.విద్యార్థిని విద్యార్థుల్లో సృజనాత్మక,తార్కిక మేధస్సును పెంపొందించే ఈ ప్రదర్శనలు నిర్వహించడం ఎంతో గర్వకారణం అన్నారు.ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్,రామన్ ఎఫెక్ట్ను కనుగొని భారతదేశానికి నోబెల్ బహుమతిని తీసుకువచ్చిన సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం ఆనంద దాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపాలెం హెడ్ మాస్టర్ గిరిధర్ బాబు,కోట ఏవికేఆర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular