ePaper
Thursday, February 26, 2026
Homeరామకుప్పంచంద్రబాబు పాలనలో గ్రామీణ రోడ్లకు మహర్దశ.

చంద్రబాబు పాలనలో గ్రామీణ రోడ్లకు మహర్దశ.

📰 Generate e-Paper Clip

రామకుప్పం స్వర్ణసాగరం ఫిబ్రవరి 25,
రామకుప్పం మండల పరిధిలో పంద్యాలమడుగు పంచాయతీలో ఇటీవల నూతనంగా మంజూరైన 44 లక్షల రూపాయల విలువగల బిటి రోడ్డు పనులను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహ కార్యదర్శి, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరియు ఎన్డీఏ కూటమి సారాధ్యంలో గ్రామాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు మౌలిక వసుతల కల్పన దిగ్విజయంగా యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారని పేర్కొంటూ రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాటన్నిటిని అధిగమించి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీనేనాని పేర్కొన్నారు. 44 లక్ష రూపాయలు అంచనా తో పల్లి కుప్పం గొల్లపల్లి రోడ్డు నుండి పంద్యాలమడుగు అరకు వరకు చేపడుతున్న ఈ రోడ్డును నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని గుత్తేదారులకు ఆయన సలహా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మునస్వామి మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ కామరాజు నాయక్ మాజీ మండల అధ్యక్షుడు ఆనంద రెడ్డి ఎంపీపీ సులోచన గురప్ప,ముఖ్య నేతలు రామమూర్తి, గంటలప్ప గౌడ్, మనోహర్ ,రఘు, శ్రీనివాస్ గౌడ్,రాజన్న, చంద్రారెడ్డి,పవన్ కుమార్ ,మాజీ ఎంపీటీసీ అల్లి శ్రీను, ఆదిల్ భాషా ,పట్రా సత్తి,బాలు, భాస్కర్,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular