ePaper
Thursday, February 26, 2026
Homeరామకుప్పంపికేయం ఉడా చైర్మన్ సురేష్ బాబు

పికేయం ఉడా చైర్మన్ సురేష్ బాబు

📰 Generate e-Paper Clip

రామకుప్పం స్వర్ణసాగరం ఫిబ్రవరి 25

భారత దేశంలో ఎక్కడా లేని విధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త మీద పొన్నువేసి చెత్త పాలన సాగించారని దీనికి భిన్నంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోని గ్రామాల అభివృద్ధి సాధ్యమని  గ్రామాల చెత్త సేకరణ కోసం కోసం ప్రత్యేక వాహనాలు ఉంచి చెత్త నుండి సంపద సృష్టిస్తోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, పికేఎం ఉడాచైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పేర్కొన్నారు. గురువారం రామకుప్పం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర- స్వచంద్ర కార్యక్రమంలో భాగంగా మండలానికి కేటాయించిన స్వర్ణ రథం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో చెత్త సేకరణ కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాలలో ప్రజలు తమ యొక్క ఇంటిలోని చెత్తను వేసి పరిసరాలు పరిశుద్ధంగా ఉంచేందుకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరమణ ,కామరాజు నాయక్ ,మాజీ మండలఅధ్యక్షుడు ఆనంద్ రెడ్డి, ఎంపీపీ సులోచన గుర్రప్ప, ఎంపీడీవో లక్ష్మి కాంత్,కుప్పం నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు నరసింహులు, కడా అడ్వైసింగ్ కమిటీ మెంబర్ రఘు, క్లస్టర్ ఇంచార్జ్ రవిరెడ్డి ,యూనిట్ ఇంచార్జ్ గజేంద్ర, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పవన్ కుమార్, పంచాయతీ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అల్లి శ్రీను, బిజెపి నేత రాజా సింహ, కుప్పం నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి, మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు దయ ,పంచాయతీ కార్యనిర్వహణాధికారి సోమశేఖర్ ,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular