ePaper
Thursday, February 26, 2026
Homeఎడిటోరియల్ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి....నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి

ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి….నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 23

నిరంతరం ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడు నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి అన్నారు.కోట మండలం కోటలో సోమవారం నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి 33వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహానికి వినోద్ కుమార్ రెడ్డి నల్లపరెడ్ల అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాసులు రెడ్డి రాజకీయాలలోకి అడుగుపెట్టిన మొదటి నుండి తుది శ్వాస విడిచే వరకు ప్రజాసేవకే అంకితమై ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని అసెంబ్లీకి ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా, అసెంబ్లీలో సైతం తన గళాన్ని విప్పి అసెంబ్లీ టైగర్ అనే పేరు తెచ్చుకున్నారని అన్నారు.అధికారంలో ఉన్న లేకపోయినా తన గ్రామాన్ని తన ప్రాంత ప్రజలను ఏనాడు మరచిపోకుండా ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి శ్రీనివాసులు రెడ్డి అని అన్నారు. అయినా మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమించారని,ఆనాడు నిర్మించిన ప్రతి ప్రభుత్వ భవనాలపై, కార్యాలయాలపై,ఎక్కడ చూసినా నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరే కనిపిస్తుందని అభివృద్ధికి చిరునామా నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రగతి విద్యాసంస్థల అధినేత పసుపులేటి కిషోర్,సర్పంచ్ ఇండ్ల వెంకట రమణమ్మ,ఉపసర్పంచ్ గాది భాస్కర్,ఎంపీటీసీ మోబిన్ భాష, గునుపూడి నంద,ఇస్మాయిల్, నల్లపరెడ్ల అభిమానులు తదితరులు భారీగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular