ePaper
Saturday, March 7, 2026
Homeఎడిటోరియల్2026 వ సంవత్సరంలో అర్హులందరికీ కొత్త పింఛన్లు ఇవ్వనున్న ప్రభుత్వం

2026 వ సంవత్సరంలో అర్హులందరికీ కొత్త పింఛన్లు ఇవ్వనున్న ప్రభుత్వం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 28

ఈ 2026 వ సంవత్సరంలో అర్హులయిన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించినదని జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు తూపిలి రాధాక్రిష్ణారెడ్డి తెలిపారు.తెలుగుదేశం పార్టీ జాతీయ అథ్యక్షులు,ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చేత ప్రారంభించబడిన పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా ఒకటవ తేదీన సచివాలయ సిబ్బందితో కలసి సామాజిక పింఛన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో మార్చి 1 వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగా సచివాలయ సిబ్బంది కందికట్టు సురేంద్ర,రాయపు వసుధతో కలసి పింఛన్లు పంపిణీ చేసిన సందర్భంగా తూపిలి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 60 సంవత్సరాల వయస్సు పూర్తయిన వారికి వృద్ధాప్య పింఛన్ల మంజూరుకు భర్త చనిపోయిన వితంతువులకు,వితంతు పింఛన్ల మంజూరుకు, ఒంటరి  మహిళలకు,వికలాంగులకు పింఛన్ల మంజూరుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి,అర్హులైన వారి నుండి పింఛన్ల కొరకు దరఖాస్తులు స్వీకరించడానికి కృషి చేస్తున్నామని,ఈ ఏడాది కొత్త పింఛన్ల మంజూరు చేయడం ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారని ఆ మేరకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా వితంతు, వృద్ధాప్య పింఛన్ సొమ్మును 3000 నుండి 4000 కి,వికలాంగ పింఛన్ మొత్తాన్ని 3000 నుంచి 6000 కి పూర్తిగా మంచానికే పరిమితమై కదలలేని వారి పింఛను సొమ్మును 3000 నుండి 15000 పెంచి ప్రతినెలా ఒకటవ తేదీన కానీ అంతకు ముందు రోజు కానీ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయిస్తున్నదన్నారు. పింఛను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు ప్రక్క నెలలోనే వితంతు పింఛను మంజూరు చేస్తూ,మూడు నెలల పింఛను సొమ్ము ఒకేసారి తీసుకునే వెసులుబాటును తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కల్పించినదని చెప్పారు.పింఛను తీసుకుంటూ గత వైకాపా ప్రభుత్వ పాలనా కాలంలో చనిపోయిన భర్తల స్థానంలో వితంతు పింఛను మంజూరు కాని దాదాపు మూడు లక్షల మంది వితంతువులకు కూటమి ప్రభుత్వం వితంతు పింఛను మంజూరు చేసి సకాలంలో పంపిణీ చేస్తోందన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో ను కూడా ఇవ్వనంతగా 4000,6000,10000, 15000 వంతున పింఛను సొమ్మును 65 లక్షల మంది లబ్దిదారులకు సకాలంలో సమర్ధంగా అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ అండగా నిలిచి ఆశీర్వదించాలని రాధాక్రిష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular