ePaper
Friday, March 6, 2026
Homeఎడిటోరియల్ఆన్ బిన్ సువడుగల్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

ఆన్ బిన్ సువడుగల్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 6

చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు శుక్రవారం ఆన్ బిన్ సువడుగల్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి చేతుల మీదుగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదోతరగతి ప్రధానమైన ఘట్టమని ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదివి పదవ తరగతి పరీక్షలలో మంచి ఫలితాలను సాధించి అటు కన్నవారికి ఇటు చదువు చెప్పిన గురువులకు పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు.ప్రతి వ్యక్తికి చదువు ఒక ఆయుధమని ఆస్తిపాస్తులు లేకున్నా చదువు ఒకటి ఉంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చని ఈ సందర్భంగా భూపతి మోహన్ సాయి విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు తమ సంస్థ ద్వారా పరీక్ష సామాగ్రిని పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్,కొత్తూరు సుబ్రమణ్యం,హైస్కూల్ ఇంచార్జి హెడ్ మాస్టర్ సజీవన, ఉపాధ్యాయులు ముని,భాస్కర్,శ్రీనివాస మూర్తి,కోటయ్య,చిల్లకూరు చిత్రలేఖనం ఉపాధ్యాయులు పాల మల్లికార్జున రావు,పాల్ సురేంద్ర, సిఆర్పీ భాస్కర్,వాసు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular