ePaper
Friday, March 6, 2026
Homeఎడిటోరియల్కుమ్మర మాన్యం భూ కబ్జాదారులపై పోరాటం- పెళ్లూరు సుమన్ ప్రజాపతి

కుమ్మర మాన్యం భూ కబ్జాదారులపై పోరాటం- పెళ్లూరు సుమన్ ప్రజాపతి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 3

కుమ్మర మాన్యం భూ కబ్జాదారులపై పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్ ప్రజాపతి  పేర్కొన్నారు.నెల్లూరు జిల్లా,మర్రిపాడు మండలం,బ్రాహ్మణపల్లి గ్రామంలో సర్వే నెం.293 లో గల,3.32 ఎకరాల కుమ్మర మాన్యమును అదే గ్రామానికి చెందిన అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి తండ్రి చిన్నారెడ్డి కబ్జా చేసారని ప్రశించిన కుమ్మర కులస్థులను బెదిరిస్తున్నాడని,భూమి కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్ ప్రజాపతి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు.జేసీ ని కలిసి వినతి పత్రంతో పాటు 1076 జీవో కాపీలను అందజేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్ ప్రజాపతి మాట్లాడుతు రాష్ట్రంలో కుమ్మర్లకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన వారికి అండగా నిలబడి పోరాటం చేస్తుందన్నారు.అవసరం అయితే రానున్న రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్న కుమ్మర్లతో కలిసి న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామన్నారు.భూ కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వై సౌందర్ రాజా ప్రజాపతి,రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్ ప్రజాపతి,జిల్లా ఉపాధ్యక్షులు అబిసాగర్,నెల్లూరు జిల్లా కుమ్మర సంఘ నాయకులు ఐనకోట రఘు రామయ్య, మురళి కృష్ణ,గ్రామస్తులు జి.రవి,జి.రఘుబాబు, జి.రాఘవేంద్ర,రాఘవరావు,మల్లికార్జున మరియు కులస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular