కోట స్వర్ణసాగరం మార్చి 3
గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండ గ్రామానికి చెందిన బూదురు సునీల్ కుమార్ అనే వ్యక్తి కొన్ని అనివార్య కారణాల వల్లన ఆత్మహత్యకు పాల్పడి చనిపోవటం జరిగింది.సునీల్ కుమార్ ఒక ప్రవేట్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ ఉండేవాడు.ఇతనికి ఇద్దరు చిన్న పిల్లలు మరియు భార్య ఉన్నారు. బూదురు సునీల్ కుటుంబంకు పెద్ద ఆస్థిపాస్తులు లేకపోయినా చదువు అనే ఆయుధంతో బాగా చదువుకొని నలుగురికి మంచి చేస్తూ ప్రజలలో గొప్ప మానవతా విలువలతో కలవకొండ గ్రామ ప్రజల గుండెల్లో ఓ మంచి వ్యక్తిగా నిలిచిపోయాడు.బూదురు సునీల్ చనిపోయిన తరవాత ఆ కుటుంబం అయోమయంలో పడింది.కలవకొండ గ్రామ ప్రజలు అందరు సమావేశమై సునీల్ కుమార్ పిల్లలకు నిశహయులుగా మారకూడదు అని భవించి వందలాది మంది జనాభా మంగళవారం వైసీపీ నాయకులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిఇంటికి చేరుకొని,ఈ సమాచారని క్లుప్తంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి కి గ్రామస్తులు విన్నవించగా వెంటనే స్పందించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి తన వంతుగా చిన్నారుల చదువు నేపథ్యంలో 5 లక్షలు రూపాయలు ఆర్ధిక సహాయాన్ని వెంటనే అందించి మానవత్వం చాటుకున్నారు.ఆ పిల్లలకు అండగా ఉంటానని శ్యామ్ ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.
అంతే కాకుండా సునీల్ కుమార్ ఆత్మహత్యకు కారణం అయినా విద్యాసంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపి సునీల్ కుమార్ కుటుంబానికి తాగు పారితోషం వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
ఈసందర్భంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మీకు అందరికి నేను అండగా ఉంటాను ఎవరు అధైర్యం పడద్దు అని భరోసా ఇచ్చారు.



