ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే సునీల్ కుమార్ చొరవతో శ్యామసుందరపురం కాలనీకి ఫీజర్ బాక్స్

ఎమ్మెల్యే సునీల్ కుమార్ చొరవతో శ్యామసుందరపురం కాలనీకి ఫీజర్ బాక్స్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి23

కోట మండలం శ్యామసుందరపురం కాలనీకి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో టిడిపి నేత షేక్ అహ్మద్ ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్ సుహాసిని కి ఎస్సీ వర్గ ప్రజల సౌకర్యార్థం శుక్రవారం ఫ్రీజర్ బాక్స్ కు 70 వేల రూపాయల చెక్కు అందజేశారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ శ్యామసుందరపురం కాలనీలో ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ బాక్స్ వరకు అనేక ఇబ్బందులు పడుతున్నామని తమ కాలనీకి ఒక ఫీజర్ బాక్స్ అవసరమని వార్డ్ మెంబర్ సుహాసిని,మంద వెంకటేశ్వర్లు కోరారని వారి కోరిక మేరకు ప్రజల సౌకర్యార్థం నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ చొరవతో ఫ్రీజర్ బాక్స్ కొరకు 70 వేల రూపాయలు చెక్కును అందించడం జరిగిందని,ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.ఈ నేపథ్యంలో కాలనీ ప్రజలు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి జలీల్ అహ్మద్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో నెల్లూరు మోహన్ రెడ్డి,వాకా విజయభాస్కర్ రెడ్డి,తిరుమలశెట్టి కోటేశ్వరరావు, షాంశుద్దీన్,దారా సురేష్,వెంకటకృష్ణయ్య, తిరుమూరు మురళి,మీజూరు మధు,సుహాసిని, పోలమ్మ,నారాయణ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular