గూడూరు, స్వర్ణ సాగరం:
స్థానిక పరిధిలోని గాంధీనగర్ సెక్టర్ చౌటపాలెంలో మంగళవారం కిషోరి వికాస వేసవి సెలవుల శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి షేక్ మహబూబి హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిషోరి బాలబాలికలకు సమతుల్య ఆహారం, అధిక బరువు కౌమార దశ, అధిక రక్తహీనత, బాల్యవివాహాలు, అక్రమ రవాణా,చైల్డ్ హెల్ప్ లైన్ అనేక విలువైన అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ స్వరూప రాణి, అంగన్వాడి కార్యకర్తలు టి.దేవసేనమ్మ ఎస్.కృష్ణవేణి ఎం.యశోద హెల్పర్లు పాల్గొన్నారు.



