వాకాడు స్వర్ణసాగరం జూన్ 3 :
గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డా.పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి కొండూరులోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి అభిమానులు, పార్టీ కార్యకర్తలు,చిన్నారులతో ఆనందాన్ని పంచుకున్నారు.అనంతరం వారికి కేక్ తినిపించి జన్మదిన వేడుకలను ఉత్సాహభరితంగా జరిపారు.ఈ సందర్భంగా దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తున్న ఎమ్మెల్యే డా.పాశిం సునీల్ కుమార్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో ఎమ్మెల్యే చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొని ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.



