ePaper
Wednesday, April 15, 2026
Homeఎడిటోరియల్టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ దాతృత్వంతో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ

టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ దాతృత్వంతో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 31

కోట మండలం కోటలోని శ్రీ కోటమ్మ తల్లి గిరిజన కాలనీలో శనివారం నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ దాతృత్యంతో కాలనీలోని గిరిజన నిరుపేదలకు 200 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ నేపథ్యంలో నలపరెడ్డి గోపాల్ రెడ్డి చిత్రపటానికి టిడిపి మండల పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ నల్లపరెడ్డి గోపాల్ రెడ్డి నిరుపేదల కోసం ఎంతగానో పరితపిచ్చారని,అలాంటి మహా నేత వర్ధంతి కార్యక్రమాన్ని నిరుపేదల మధ్యలోనే జరుపుకోవడం ఆయనకి మనం ఇచ్చే గౌరవం అని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి,నెల్లూరు మోహన్ రెడ్డి,వాకా విజయ భాస్కర్ రెడ్డి,తిరుమలశెట్టి కోటేశ్వరరావు, మీజూరు మల్లికార్జునరావు,టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular