కోట స్వర్ణసాగరం జనవరి 16
కోట మండలం కోటలోని మహాలక్ష్మమ్మ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతికి శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మమ్మ తిరునాళ్లను అంగరంగ వైభవముగా నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా ఈ సంవత్సరం మహాలక్ష్మమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం టిడిపి నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డిని మహాలక్ష్మమ్మ యూత్ సభ్యులు ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు విచ్చేసిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ సంప్రదాయం ప్రకారం కండువా వేసి ఆహ్వానించారు.అనంతరం పండితులు మహా లక్ష్మమ్మ అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించి వినోద్ కుమార్ రెడ్డికి హారతి అందించి తీర్థ ప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మహాలక్ష్మి అమ్మ వీధి ప్రజలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తమను ఉత్సవాలకు ఆహ్వానించి వారి ప్రేమాభిమానాలు చూపుతున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,ఎంపీటీసీ షేక్ మోబిన్ భాష,తూపిలి రాధాకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.



