వరదయ్య పాలెం స్వర్ణ సాగరం ఫిబ్రవరి 06
వరదయ్యపాలెం మండలంలో ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన బి.జి.ఆర్ కాలనీవాసులకు ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమనికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిధిగా విచ్చేసారు, కలెక్టర్ కి వరదయ్యపాలెం టీడీపీ మండల నాయకులు క్లస్టర్ ఇంచార్జి నిర్మల్ మరియు మల్లి నాయుడు సాధరస్వాగతం పలుకుతూ శాలువాతో సత్కారించి పుష్ప గుచ్యం అందజేసిన మండల నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా స్వాగతం పలికారు.వరదయ్యపాలెం మండలంలో బి జి ఆర్ కాలనీ ప్రజలు లోతట్టు ప్రాంతాలలో ఉండటంవల్ల వర్షాలుకు ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో కలెక్టర్ స్పందించి దాదాపు 440 ఇంటి పట్టాలను ఇవ్వాల్సి ఉండగా అందులో 150 ఇంటి పట్టాలను బి జి ఆర్ ఎస్ టి కాలనీ వాసులకు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమానికి వరదయ్యపాలెం మండలంలో విశేష స్పందన లభించడంతో ఈ కార్యక్రమం విజయంవంతం జరిగింది,పెద ప్రజలకు ఇంటిపట్టలు అందించిన గౌరవ కలెక్టర్ కి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు…_
కలెక్టర్ వెంకటేశ్వర్లు కి ఘన స్వాగతం పలికిన టీడీపీ క్లస్టర్ ఇంచార్జి నిర్మల్ మరియు మల్లి కార్జున్ నాయుడు
RELATED ARTICLES



