కోట స్వర్ణసాగరం ఫిబ్రవరి 7
త్యాగానికి ప్రతిరూపం మాత రమా బాయి అంబేద్కర్ అని బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ పేర్కొన్నారు.కోట మండలం కోటలో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి అంబేద్కర్ 128 వ జయంతి వేడుకలను కోటలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక నాయకులు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మాత రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బహుజన ఐక్యవేదిక నాయకులు మీజూరు మాధవ్,దాసరి సుందరం లు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప శక్తిగా ఎదగడం వెనుక మాతా రమాబాయి చేసిన త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు.కటిక పేదరికాన్ని అనుభవిస్తూ, బిడ్డల మరణాన్ని దిగమింగుకుని కూడా భర్తను ఉన్నత చదువుల వైపు,సమాజ పోరాటం వైపు నడిపించిన ధీరవనిత ఆమె అని గుర్తుచేశారు. నేటి మహిళా సమాజానికి, ముఖ్యంగా విద్యార్థి లోకానికి రమాయి జీవితం ఒక గొప్ప స్ఫూర్తి అని,ఆమె ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు.మాత రమాబాయికి అంబేద్కర్ తో బాల్యంలోనే వివాహం జరిగి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ బిఆర్ అంబేద్కర్ తో కలిసి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న గొప్ప ఆదర్శవాది అని అన్నారు.అంబేద్కర్ లక్ష్య సాధనకు రమా బాయి నిరంతరం తోడ్పాటు అందించారని,ఆమెను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.సమాజంలోని మహిళలు రమాబాయి అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ రోజు మహిళలకు అన్ని విధాలుగా హక్కులు లభించాయన్నారు.అంబేద్కర్ విజయం వెనుక రమాబాయి పాత్ర ఎంతో ఉందన్నారు. రమాబాయి గురించి ప్రతి ఒక్కరికీ తెలపాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో దాసరి సుందరం,పాల మల్లికార్జున రావు,బిటిఏ నాగరాజు,పామల రాజగోపాల్,పనబాక హేమంత్ కుమార్,మీదురు శ్రీనివాసలు,భూపతి మోహన్ సాయి,మీజూరు రమేష్,ఇనమాల రాజముణి,
ఏలూరు దేశయ్య,కుదురు కోటేశ్వర రావు,కావాలి కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.



