ePaper
Thursday, July 30, 2026
Homeఎడిటోరియల్షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్సీఆర్ నగర్ కల్వర్టు పనులు శరవేగం

షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్సీఆర్ నగర్ కల్వర్టు పనులు శరవేగం

📰 Generate e-Paper Clip

🔶షేక్ జలీల్ అహ్మద్ పర్యవేక్షణలో వేగంగా నిర్మాణం

🔷ప్రజలకు,వాహనదారులకు ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో పనులు

కోట స్వర్ణసాగరం జులై 30

కోట మండలంలోని ఎన్సీఆర్ నగర్ ఎదురుగా ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న కల్వర్టు పనులు టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల భూమి పూజతో ప్రారంభమైన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నిర్మాణ పనుల సమయంలో ప్రజలు,వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ పనులను కొనసాగిస్తున్నారు.రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన రహదారిపై కూడా పనులు వేగంగా సాగుతుండటంతో నిర్మాణ సంస్థకు షేక్ జలీల్ అహ్మద్ నిరంతరం సూచనలు చేస్తున్నట్లు తెలిసింది.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ,అభివృద్ధి పనులు ప్రారంభించడం మాత్రమే కాదు నిర్ణీత సమయంలో నాణ్యతతో పూర్తి చేయడమే మా లక్ష్యం.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, త్వరితగతిన కల్వర్టును అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం అని తెలిపారు.అలాగే పోలీసు శాఖ సహకారంతో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పనులు జరుగుతున్నాయి.ప్రజల సహకారం కూడా ఎంతో అవసరం.పూర్తయిన తర్వాత ఈ కల్వర్టు ఎన్సీఆర్ నగర్ అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.
వర్షాకాలంలో నీటి ప్రవాహం వల్ల ఎదురయ్యే సమస్యలకు ఈ కల్వర్టు శాశ్వత పరిష్కారంగా మారనుందని,ప్రజల భద్రత,రాకపోకల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత నాణ్యతతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.స్థానికులు మాట్లాడుతూ ప్రారంభించిన వెంటనే పనులు వేగంగా కొనసాగించడం అభినందనీయం.ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని చిత్తశుద్ధితో పనిచేస్తున్న షేక్ జలీల్ అహ్మద్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.పనులు పూర్తయిన తర్వాత ఎన్సీఆర్ నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు,వాహనదారులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ నిర్మాణ పనులలో టీడీపీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమశెట్టి కోటేశ్వరరావు ఎంపిటిసి శంసుద్దీన్,టిడిపి నాయకులు షేక్ నౌషాద్,ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular