♦️యువ నాయకత్వానికి జగన్ పెద్దపీట
♦️వైఎస్ జగన్ నిర్ణయంతో రాష్ట్ర స్థాయి బాధ్యతలు
♦️కోవ్వూరు నియోజకవర్గానికి దక్కిన అరుదైన గుర్తింపు
కోట స్వర్ణసాగరం జులై 30
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ రాష్ట్ర కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ప్రజా సేవకు చిరునామాగా నిలిచిన అసెంబ్లీ టైగర్ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మనవడు,మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడైన రజత్ కుమార్ రెడ్డికి రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతలు దక్కడం జిల్లాలో రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.ఈ నియామకం యువతకు మరింత ప్రోత్సాహాన్నిచ్చే నిర్ణయమని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.యువతకు వారధిగా పార్టీ బలోపేతమే లక్ష్యం రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా రజత్ కుమార్ రెడ్డి యువతను పార్టీ సిద్ధాంతాల వైపు మరింతగా ఆకర్షించడం,గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యువ నాయకత్వాన్ని సమీకరించడం,ప్రజా సమస్యలపై చురుకైన పాత్ర పోషించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రజత్ కుమార్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ ఆశయాల సాధన కోసం అంకితభావంతో పనిచేస్తూ యువతను మరింతగా చైతన్యపరిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
రజత్ కుమార్ రెడ్డి నియామకాన్ని స్వాగతిస్తూ కోవ్వూరు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు,యువ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.ఆయన నాయకత్వంలో యువజన విభాగం మరింత బలోపేతమై పార్టీకి కొత్త ఊపును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.



