ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్ఫిర్యాదుపై వివరణ ఇచ్చిన గుండాల మధు-ఆలయ కమిటీకి క్షమాపణ

ఫిర్యాదుపై వివరణ ఇచ్చిన గుండాల మధు-ఆలయ కమిటీకి క్షమాపణ

📰 Generate e-Paper Clip

♦️పొరపాటున ఫిర్యాదు చేశానని అంగీకారం గుండాల మధు

♦️సంగమేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించడం ఉద్దేశం కాదని స్పష్టీకరణ

కోట స్వర్ణసాగరం జూలై 28

కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఇటీవల ఫిర్యాదు చేసిన వ్యక్తి అయిన గుండాల మధు ఆ ఫిర్యాదు అపోహలు మరియు పూర్తి సమాచారం లేకుండా పొరపాటున చేసినట్లు తానే సొంతంగా వెల్లడించారు.ఈ సందర్భంగా గుండాల మధు గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కు స్థానిక టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డికి,ఆలయ ఈవో కూడారి పెంచల వరప్రసాద్ కు ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ పెద్దలు,ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భక్తులకు క్షమాపణలు తెలిపారు.తన ఉద్దేశం ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించడం కాదని,కొన్ని విషయాలపై వచ్చిన సందేహాలు మధ్యవర్తుల మాటలు వినిన నేపథ్యంలో తొందరపాటుతో ఫిర్యాదు చేశానని వివరించారు.అలాగే ఆలయ నిర్వహణపై పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం తనకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యాయని,దీంతో తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.తన వల్ల ఆలయ కమిటీ సభ్యులు,అధికారులు,భక్తులు ఎవరికైనా మనస్తాపం కలిగి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు.ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ,దేవస్థానం వ్యవహారాలు నిబంధనల ప్రకారమే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎలాంటి సందేహాలు ఉన్నా అధికారులను లేదా కమిటీని నేరుగా సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.గ్రామ పెద్దలు కూడా ఇలాంటి విషయాల్లో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఆరోపణలు చేయాలని, అపోహలకు తావివ్వకుండా ఆలయ ప్రతిష్ఠను కాపాడేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular