కోట స్వర్ణసాగరం జులై 29
కోట మండలం వెంకన్నపాళెం గ్రామంలో టీడీపీ నాయకుడు కోకర్ల మధు యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా కోకర్ల మధు యాదవ్ మాట్లాడుతూ,గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో కోట మండలంలోని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.గ్రామాల్లో రహదారులు,తాగునీటి సౌకర్యం,పారిశుధ్యం,మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.అదేవిధంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకూ చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి టీడీపీ నాయకులు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.ప్రచార కార్యక్రమానికి గ్రామ ప్రజలు సానుకూలంగా స్పందించారని,టీడీపీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ పార్టీకి తమ మద్దతు తెలియజేశారని కోకర్ల మధు యాదవ్ అన్నారు.రానున్న రోజుల్లో కూడా ప్రజాసేవే లక్ష్యంగా గ్రామాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కోకర్ల మధు యాదవ్,యరగల వీరయ్య,పిట్టల అనిల్ కుమార్,టీడీపీ నాయకులు,కార్యకర్తలు,పాల్గొన్నారు.



