ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్స్వర్ణముఖి నదిలో మట్టిరోడ్డు పునరుద్ధరణ-సొంత నిధులతో ముందుకొచ్చిన పాదర్తి కోటారెడ్డి

స్వర్ణముఖి నదిలో మట్టిరోడ్డు పునరుద్ధరణ-సొంత నిధులతో ముందుకొచ్చిన పాదర్తి కోటారెడ్డి

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జూలై 27

కోట మండలం పుచ్చలపల్లి గ్రామం నుంచి దైవాలదిబ్బ,దొరువుకట్ట గ్రామాలకు స్వర్ణముఖి నది మీదుగా వెళ్లే మట్టిరోడ్డు గత సంవత్సరం డిసెంబర్‌లో వచ్చిన వరదల ధాటికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు,స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన టీడీపీ నాయకుడు, సిద్ధవరం సొసైటీ చైర్మన్ పాదర్తి కోటారెడ్డి తన సొంత నిధులు వెచ్చించి మట్టిరోడ్డు మరమ్మతు పనులు చేపట్టించి వాహనాల రాకపోకలకు అనువుగా రహదారిని ఏర్పాటు చేయించారు.దీంతో దైవాలదిబ్బ,దొరువుకట్ట గ్రామాలకు వెళ్లే వాహనదారులు,స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారం చూపిన పాదర్తి కోటారెడ్డిని అభినందించారు.ఈ చర్యతో గ్రామాల మధ్య రాకపోకలు మళ్లీ సులభతరం అయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular