ePaper
Wednesday, July 29, 2026
Homeఎడిటోరియల్షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటి ప్రచారానికి విశేష ఆదరణ

షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటి ప్రచారానికి విశేష ఆదరణ

📰 Generate e-Paper Clip

అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నేత జలీల్ అహ్మద్ కు ప్రజల అభినందనలు

కోట స్వర్ణసాగరం జులై 27

కోట మండలం శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రెండేళ్ల పాలనలో అమలైన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత స్థాయిలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు,గ్రామాభివృద్ధి పనులు,ప్రజలకు అందుతున్న సేవలను వివరించారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించి,వాటిపై అవగాహన కల్పించేందుకే ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేయడం తమ బాధ్యత అని షేక్ జలీల్ అహ్మద్ పేర్కొన్నారు.ప్రజల ఆశీర్వాదం,సహకారంతో కాలనీల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.షేక్ జలీల్ అహ్మద్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాలనీల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవను అభినందిస్తూ,ఇలాంటి నాయకత్వం గ్రామానికి అవసరమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు,ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల,దారా సురేష్,షేక్ నౌషాద్,తల్లం శ్రీనివాసులు,నందన్ మోహన్, సుహాసిని,పోలమ్మ,రవి వర్మ,వంశి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular