ePaper
Tuesday, April 14, 2026
Homeఎడిటోరియల్మానవత్వానికి నిదర్శనం టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్

మానవత్వానికి నిదర్శనం టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం మార్చి 14

మానవత్వానికి నిదర్శనంగా టీడీపీ నేత జలీల్ అహ్మద్ నిలిచారు.కోట మండలం కోటలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో  ఏడవ తరగతి చదువుతున్న ఆవుల దేశమ్మ వారం రోజుల క్రితం పాఠశాలలో ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోవడంతో పాఠశాల యాజమాన్యం ఆ బాలికను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.అయితే ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బాలికను చెన్నైకి తరలించారు. ఆ బాలిక నిరుపేద కుటుంబానికి చెందడంతో వారి తల్లిదండ్రులకు మెరుగైన వైద్యం చేయించేందుకు స్తోమత లేదని తెలుసుకున్న టిడిపి నేత జిల్లా మైనారిటీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచనలతో ఆమె వైద్య ఖర్చులు నిమిత్తం ఆమె తల్లిదండ్రులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆవుల దేశమ్మ తల్లిదండ్రులు షేక్ జలీల్ అహ్మద్ కు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular