కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 1
కోట మండలం కోటలో ఇటీవలా బహుజనుల ఐక్యత శ్రేయస్సు కొరకు నూతనంగా ఏర్పాటు చేసిన బహుజన యూత్ ఫోర్స్ (బి.వై.ఎఫ్) గూడూరు నియోజకవర్గం కన్వీనర్ గా గుణపాడు గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సేవా సమితి అధ్యక్షులు ఫౌండర్ అంబేద్కరిస్ట్ శ్రీరామ్ శివప్రసాద్ (శంకర్) నియమితులు అయ్యారు.ఈ నేపథ్యంలో బహుజన యూత్ ఫోర్స్ నాయకులు సభ్యులు శివప్రసాద్ స్నేహితులు బంధువులు శ్రీరామ్ శివప్రసాద్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అంబేద్కరిస్ట్ శ్రీరామ్ శివప్రసాద్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ గౌరవప్రదమైన పదవిని అప్పగించి,నాపై విశ్వాసం ఉంచిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.తనకి అప్పగించిన బాధ్యతను అత్యంత నిబద్ధతతో, నిజాయితీతో నిర్వర్తిస్తూ,అంబేద్కర్ ఆశయాలు మరియు బహుజన యూత్ ఫోర్స్ నాయకుల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సేవ చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.



