ePaper
Tuesday, May 5, 2026
Homeఎడిటోరియల్ప్రతిభా విద్యార్థులను అభినందించిన టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

ప్రతిభా విద్యార్థులను అభినందించిన టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే దాతృత్వంతో నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు ప్రోత్సాహ నగదు బహుమతులు

కోట స్వర్ణసాగరం మే 2

కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష ఫలితాలలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు.ఈ నేపథ్యంలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించిన విద్యార్థులకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ దాతృత్వంతో శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహ బహుమతులను అందించారు.కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని పి.నాగ శిరీష 577 మార్కులు సాధించి జడ్పీ హైస్కూల్లలో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించినందుకు నాగ శిరీష కి 10,000 రూపాయలు కొత్తపాలెం హైస్కూల్లో 549 మార్కులు సాధించి పాఠశాల రెండవ స్థానం సాధించిన ఎస్.కే.సుమయ కు 5000 రూపాయలు,అలాగే 533 మార్కులు సాధించి పాఠశాల మూడవ స్థానం సాధించిన పి.సాయి సుధా కు 3000 రూపాయల నగదు బహుమతులను నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందించి విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్య అనే ఆయుధం ఎంతటి కటిక పేదరికం అయినా జయింప చేస్తుందని,జీవితంలో ఆస్తి అంతస్తులు లేకపోయినా చదువు ఒకటి ఉంటే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరవచ్చని,విద్యకు మించిన ఆయుధం ఏమీ లేదని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి కన్న తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు పుట్టి పెరిగిన గ్రామానికి మంచి పేరు ప్రదర్శన తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కట్టా శంకర్ రెడ్డి,సుమన్ పాఠశాల హెచ్ఎం గిరిధర్ బాబు,స్కూల్ అసిస్టెంట్ పరమేశ్వరి,కోటయ్య షౌకత్ హుస్సేన్,కరిముల్లా మేఘనాథ్, రోశయ్య,అరుణలత విద్యార్థిని,విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular