ePaper
Friday, June 5, 2026
Homeఎడిటోరియల్కమనీయం కడు రమణీయం శ్రీ సీతారాముల కళ్యాణం

కమనీయం కడు రమణీయం శ్రీ సీతారాముల కళ్యాణం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జూన్ 4

కోట మండల కేంద్రంలోని శ్యామసుందరపురంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ప్రవాస భారతీయులు రామిరెడ్డి వేంకటరామిరెడ్డి హైమావతమ్మ లావణ్య మధు కిరణ్ రెడ్డి  కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.తిరుపతి జిల్లా అర్చక సలహా మండలి సభ్యులు దీవి అనంతాచార్యులు శ్రీ వైఖానస ఆగమోక్తంగా కళ్యాణ ఘట్టాలను వివరిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు.గంధం శ్రీనివాసులు నిర్మలమ్మ శరవణ రాధ దంపతులు పూజా కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అరసి నరేష్ శర్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి,కృష్ణయ్య,చంద్ర ప్రసాద్ నాయుడు,బాలు,సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular