కోట : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహార సంఘాల ఉద్యోగస్తుల జె ఏ సి ఆదేశం మేరకు కోట మండలంలో పనిచేస్తున్న ప్యాక్ ఉద్యోగులు కోట లో సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్యాక్ ఆవరణలో ప్లకార్డులు చేతపట్టి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోట మండల జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 36 ను భేషరతుగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.సహకార సంఘాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఆరోగ్య భీమా కల్పించాలన్నారు. 2019 తర్వాత చేరిన తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేసి వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సహకార సంఘం ఉద్యోగులకు గ్రాట్యుటీ రెండు లక్షల మాత్రమే ఉందని దీన్ని 10 లక్షలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామన్నారు. 9వ తేదీ వరకు న్యాయమైన తమ డిమాండ్ల కొరకు రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని తరువాత ప్రభుత్వం స్పందించకుంటే జేఏసీ ఆదేశానుసారం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఊనుగుంటపాలెం సీఈవో శ్రీనివాసులు రెడ్డి ఆర్, అవధానం కోటి కొత్తపాలెం, శ్రీనివాసులు సిద్ధవరం,కే.శ్రీనివాసులు తెన్నేలపూడి,కరుణాకర్ రెడ్డి చిట్టెడు, ప్యాక్ సిబ్బంది పాల్గొన్నారు.
కోటలో వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
0
54
- Advertisment -



