*కోట స్వర్ణసాగరం జనవరి 8*
తిరుపతి,చిత్తూరు,కడప, అన్నమయ్య జిల్లాల మీడియా జోనల్ కార్యదర్శిగా కోటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పాకం చెన్నకేశవులును నియమించినట్లు హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ డాక్టర్ జిలానీ భాషా తెలిపారు. నేషనల్ ఆర్.టి.ఐ ప్రొటెక్షన్ ఫోర్స్& నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ లో నాలుగు జిల్లాల మీడియా సెక్రటరీగా చెన్నకేశవులు నియామకం పట్ల పలువురు మిత్రులు శ్రేయోభిలాషులు అభినందించి హర్ష వ్యక్తం చేశారు. సహచర పాత్రికేయ మిత్రులు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ మానవ హక్కుల పై బాధ్యతాయుతమైన స్థానంలో నిలిపినందుకు చైర్మన్ జిలాని భాషకు కృతజ్ఞతలు తెలిపారు.ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో పారదర్శకంగా సమాజం కోసం సంస్థ కోసం పని చేస్తానని తెలిపారు.



