♦️ఫిర్యాదు చేస్తేనే డ్రైనేజీ కాలువల క్లీనింగ్ లేకపోతే లేదు
♦️శ్యామసుందరపురం కాలనీలో డ్రైనేజీ కాలువల దుస్థితి
కోట స్వర్ణసాగరం జులై 14
కోట మండలం శ్యామసుందర పురం కాలనీలో డ్రైనేజీ కాలువల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.డ్రైనేజీ కాలువలను పంచాయతీ సిబ్బంది సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో డ్రైనేజీ కాలవలు నిండిపోయి మురికి వ్యర్థ నీరు ఇళ్ళలోకి ప్రవేశిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.పంచాయతీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి పలుమార్లు సమస్యలు తెలియజేసిన స్పందన లేదని కాలనీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంచాయతీ అధికారులకు సమస్య తెలియచేస్తే కొద్ది రోజులకి తూతూ మంత్రాలుగా పైపైనే డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి వెళ్లిపోవడం ఆ డ్రైనేజీ వ్యర్థ నీరు మళ్ళీ ఇళ్లల్లోకి ప్రవేశించడం వంటి సమస్యలు తరచుగా తలెత్తుతున్నాయని తెలిపారు.ఈ డ్రైనేజీ వ్యర్థ నీరు ఇళ్లల్లోకి ప్రవేశించడం వలన దోమలు బెడద ఎక్కువ అవ్వడంతో విష జ్వరాలకు గురవుతున్నామని వారు తమ బాధను వెల్లబోసుకున్నారు.ఇకనైనా పంచాయితీ అధికారులు వెంటనే స్పందించి దగ్గరుండి డ్రైనేజీ కాలువలను పూర్తిగా శుభ్రం చేయించాలని బండల కింద పేరుకుపోయిన చెత్తచెదారంను తొలగించాలని శ్యామసుందరపురం కాలనీవాసులు ఈ సందర్భంగా కోరుతున్నారు.



