ePaper
Friday, June 12, 2026
Homeఎడిటోరియల్కలియుగ వైకుంఠాన్ని తలపించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం

కలియుగ వైకుంఠాన్ని తలపించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జూన్ 6

కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం – కలియుగ వైకుంఠం – కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారికి దివ్య అలంకరణ జరిగింది.ఆలయ ధర్మకర్త నేదురుమల్లి.ప్రసేన్ కుమార్ రెడ్డి,మైథిలి దంపతుల ఆధ్వర్యంలో శనివారం నాడు కలియుగ వైకుంఠంగా భక్తులచే ప్రసిద్ధి చెందిన శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తి,శ్రద్ధ,ఆధ్యాత్మికతల నడుమ అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది.అభిషేకానంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కందనూరు శీతారామ స్వామి వారు అపారమైన భక్తి భావంతో స్వామివారికి అద్భుతమైన అలంకారాన్ని నిర్వహించారు.స్వామివారికి నూతన పట్టు వస్త్రాలను ధరింపజేసి,సుగంధభరితమైన పూలమాలలు,తులసి దళాలు,సుందరమైన పుష్పాలతో అత్యంత మనోహరంగా అలంకరించారు.ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు పరవశించి, “గోవిందా… గోవిందా…” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.అభిషేకం అనంతరం స్వామివారి ముఖారవిందం నుంచి వెలువడిన దివ్య కాంతి ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో నింపివేసింది.సర్వాలంకార భూషితుడై కొలువుదీరిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు భక్తులకు సాక్షాత్తు శ్రీనివాస కల్యాణ స్వరూపంగా దర్శనమిచ్చారు.
స్వామివారి అలంకరణలో ప్రతి పుష్పం భక్తిని, ప్రతి వస్త్రం పవిత్రతను,ప్రతి అలంకార అంశం వైష్ణవ సంప్రదాయ మహిమను ప్రతిబింబించింది.ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కందనూరు శీతారామ స్వామి వారి సేవా తత్పరత,ఆగమ శాస్త్ర పరిజ్ఞానం,స్వామివారి పట్ల గల అచంచల భక్తి ఈ అలంకరణలో ప్రతిఫలించింది.వారి చేతుల మీదుగా జరిగిన ఈ దివ్య అలంకారం భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసింది.స్వామివారి దివ్య దర్శనం పొందిన ప్రతి భక్తునికి ఆయురారోగ్యాలు,ఐశ్వర్యాలు, సుఖసంతోషాలు,విజయాలు కలగాలని,శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం సదా అందరిపై ఉండాలని ప్రార్థించారు.
గోవింద నామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular