ePaper
Friday, June 12, 2026
Homeఎడిటోరియల్వరదయ్యపాలెం నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన శివరామ సుబ్బయ్య

వరదయ్యపాలెం నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన శివరామ సుబ్బయ్య

📰 Generate e-Paper Clip

వరదయ్యపాలెం స్వర్ణ సాగరం జూలై 5, 2026

వరదయ్యపాలెం మండల నూతన తహసీల్దార్‌గా శివరామసుబ్బయ్య  గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పాకాల డిప్యూటేషన్ మీద తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆయన, బదిలీపై వరదయ్యపాలెం మండలం వచ్చారు.తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సిబ్బంది, రెవెన్యూ అధికారులు నూతన తహసీల్దార్‌కు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం  అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా నూతన తహసీల్దార్ మాట్లాడుతూ, “ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడమే నా ప్రధాన లక్ష్యం. రైతులు, భూ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా కార్యాలయానికి వచ్చి కలవవచ్చు. ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు.అలాగే మండలంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ఆక్రమణల సమస్యలు, స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్,వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular