ePaper
Monday, June 15, 2026
Homeఎడిటోరియల్కోట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల

కోట పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 27

కోట మండలం కోట పోలీస్ స్టేషన్ ను నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వెజెండ్ల మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.నేపద్యంలో స్టేషన్లోని పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ అజిత వెజెండ్ల మీడియాతో మాట్లాడుతూ మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని అన్నారు.ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ద్విచక్ర వాహదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ ను అమలు చేయాలని అన్నారు. గ్రామాలలో రౌడీయిజాన్ని సహించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గూడూరు డిఎస్పి గీతా కుమారి,గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు,కోట ఎస్సై పవన్ కుమార్,కోట పోలీస్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular