ePaper
Friday, June 19, 2026
Homeఎడిటోరియల్మైనర్ బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన యువకుడు అరెస్ట్

మైనర్ బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన యువకుడు అరెస్ట్

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 29

కోట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన మురారి.వెంకటయ్య (తండ్రి.సుబ్రమణ్యం) అనే యువకుడిని గురువారం సాయంత్రం కోట ఎస్సై పవన్ కుమార్ అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా కోట పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు రూరల్ సి.ఐ.కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ సాయంత్రం నాయుడుపేట వెళ్లేందుకు రోడ్డుపై వేచి ఉన్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకుని నాయుడుపేటకి తీసుకెళ్తానని చెప్పి ఆటోలో ఎక్కించుకుని కొండుగుంట అటవీ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్న చోట ఆటో ఆపి బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన ఘటనపై కోట పోలీసులు విచారించి యువకుడి వాంగ్మూలం నమోదు చేసి కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు తెలిపారు.సదరు ఆటోను సీజ్ చేశామని తెలిపారు.ముద్దాయిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular