ePaper
Saturday, June 13, 2026
Homeఎడిటోరియల్జొక్కా సుస్మిత,ముత్యాలపాటి చైతన్య లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రగిరి మధు

జొక్కా సుస్మిత,ముత్యాలపాటి చైతన్య లకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రగిరి మధు

📰 Generate e-Paper Clip

కోట స్వర్ణసాగరం జనవరి 29 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన గ్రూప్ 2 ఉద్యోగాలలో భాగంగా నెల్లూరు జిల్లా,కోట మండలం,చిట్టేడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి విజయభాస్కర్,సునందమ్మ దంపదల కుమారుడు ముత్యాలపాటి చైతన్య అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా,మరియు అదే గ్రామానికి చెందిన జొక్కా సుస్మిత ఏఎస్ఓగా ఎంపిక అయ్యారు.ఈ నేపథ్యంలో చిట్టేడు గ్రామానికి చెందిన కోట మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,చిట్టేడు పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రగిరి మధు ముత్యాలపాటి చైతన్య,జోక్కా సుస్మిత లకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా జనసేన నాయకుడు చంద్రగిరి మధు మాట్లాడుతూ ముత్యాలపాటి చైతన్య,జొక్కా సుస్మిత పేదరికంలో పుట్టి ఎన్నో అవరోదాలను, ఒడు దుడుకులను దాటుకొని విద్య అనే ఆయుధతో పలు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు,పుట్టిపెరిగిన గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చారన్నారు.విద్య అనే ఆయుధం తో ఎంతటి పేదరికాన్ని అయినా జయించవచ్చని అందుకు నిదర్శనమే చైతన్య,సుస్మిత వారిద్దరూ సాధించిన ఉద్యోగాలని వారి ప్రతిభను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular